నూపుర్ శర్మకు 'సుప్రీం'లో మళ్లీ ఊరట: Supreme Court

by srinivas |   ( Updated:2022-09-09 10:35:57.0  )
నూపుర్ శర్మకు సుప్రీంలో మళ్లీ ఊరట: Supreme Court
X

న్యూఢిల్లీ: బీజేపీ బహిష్కృత నేత నూపుర్ శర్మకు సుప్రీంకోర్టులో మరోసారి ఊరట లభించింది. ఆమెను అరెస్ట్ చేయడానికి అధికారులకు ఆదేశాలని ఇవ్వాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించకుండా శుక్రవారం తిరస్కరించింది. మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని, సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 'కోర్టు ఆదేశాలు జారీ చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. ఈ పిటిషన్‌ను వెనక్కి తీసుకోవడమే మంచిది.' అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యూయూ లలిత్ తెలిపారు. దీంతో పిటిషనర్ తన పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. అయితే నూపుర్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలకు అరబ్ దేశాలు, ఇస్లాం కమ్యూనిటీ నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఏర్పడింది. ఒకానొక సందర్భంలో సుప్రీంకోర్టు సైతం ఆమెపై మండిపడింది. కొందరు వ్యక్తులు బెదింరింపులకు పాల్పడుతున్నారని, దేశవ్యాప్తంగా నమోదైన ఎఫ్ఐఆర్‌లను ఒకే చోట చేర్చి విచారణ జరిపేలా తీర్పును ఇవ్వాలని నూపుర్ శర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా దాఖలైన ఎఫ్ఐఆర్‌లను ఢిల్లీకి బదలాయించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Advertisement

Next Story

Most Viewed