అబార్షన్ తీర్పును వెనక్కి తీసుకున్న సుప్రీంకోర్టు.. కారణమిదే..

by Swamyn |
అబార్షన్ తీర్పును వెనక్కి తీసుకున్న సుప్రీంకోర్టు.. కారణమిదే..
X

దిశ, నేషనల్ బ్యూరో: లైంగికదాడికి గురైన 14ఏళ్ల బాధితురాలి 30వారాల గర్భాన్ని తొలగించేందుకు అనుమతిస్తూ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సోమవారం వెనక్కి తీసుకుంది. అబార్షన్ చేస్తే బాలికకు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున, బిడ్డను కనాలనుకుంటున్నట్టు బాలిక తల్లిదండ్రులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) డీవై చంద్రచూడ్‌కు తెలిపారు. ఈ నేపథ్యంలోనే సీజేఐ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం.. బాలిక ప్రయోజనాలే పరమావధిగా పేర్కొంటూ అంతకుముందు ఇచ్చిన తమ తీర్పును వెనక్కి తీసుకుంది. గర్భవిచ్ఛిత్తికి అనుమతి నిరాకరిస్తూ ఇచ్చిన బాంబే హైకోర్టు తీర్పును పక్కనబెడుతూ బాధిత బాలికకు తక్షణమే అబార్షన్ చేయాలంటూ ఈ నెల 22న సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. బాలిక 30వారాల గర్భవతి అయినప్పటికీ, అబార్షన్‌ను అనుమతించడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకోర్టు తన అసాధారణ అధికారాలను ఉపయోగించింది. అయితే, బాధిత కుటుంబం నిర్ణయం మేరకు ఈ తీర్పును తాజాగా వెనక్కి తీసుకుంది. కాగా, మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (ఎంటీపీ) చట్టం ప్రకారం, వివాహిత మహిళలతోపాటు లైంగికదాడి బాధితులు, వికలాంగులు, మైనర్ బాలికల గర్భాన్ని 24వారాలలోపే తొలగించుకోవడానికి అనుమతి ఉంటుంది.


Advertisement

Next Story

Most Viewed