భార్యను బలవంతం చేస్తున్నారా.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

by GSrikanth |   ( Updated:2022-09-29 06:21:22.0  )
భార్యను బలవంతం చేస్తున్నారా.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు
X

దిశ, వెబ్‌డెస్క్: సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువడించింది. న్యాయమూర్తి జస్టిస్ DY చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం అరుదైన తీర్పు వెల్లడించింది. భార్యను భర్త బలవంతం చేసినా దానిని అత్యాచారం కిందే పరిగణించాలని స్పష్టం చేసింది. అంతేకాదు, పెళ్లితో సంబంధం లేకుండా మహిళలు MTP చట్టం ప్రకారం అబార్షన్ చేయించుకోవచ్చని ప్రకటించింది. లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న ఒంటరి, అవివాహిత మహిళలను మినహాయించాలని సుప్రీం కోర్టు పేర్కొంది. వైవాహిక స్థితితో సంబంధం లేకుండా గర్భం దాల్చిన 24 వారాల తర్వాత సురక్షితమైన మరియు చట్టబద్ధమైన అబార్షన్ పొందేందుకు హక్కు కల్పించబడి ఉందని భారత సుప్రీంకోర్టు తీర్పులో పేర్కొంది.

Advertisement

Next Story