- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఏంటా అశ్లీల కంటెంట్.. మీరేం పట్టించుకోరా?.. కేంద్రంపై సుప్రీంకోర్టు సీరియస్

దిశ, వెబ్‌డెస్క్: యూట్యూబ్స్(Youtubes)లో వస్తో్న్న అశ్లీల కంటెంట్‌పై సుప్రీంకోర్టు(Supreme Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపైనా జస్టిస్ కాంత్(Justice Kant) నేతృత్వంలోని ధర్మాసనం సీరియస్ అయింది. అశ్లీల కంటెంట్‌ను నియంత్రించడానికి మీరేం చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం తరపున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటిని ప్రశ్నించింది. అశ్లీల కంటెంట్ నియంత్రణకు కేంద్రం తగిన చర్యలు తీసుకుంటే సంతోషమని.. కానీ అలా జరుగడం లేదని అభిప్రాయపడింది. యూట్యూబ్ ఛానళ్లు, యూట్యూబర్లు తమకున్న స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారని.. అయినా కేంద్రం పట్టించుకోవడం లేదని పేర్కొంది. ఈ అంశాన్ని కేంద్రం వదిలేసినా.. తాము వదిలేయబోమని జస్టిస్ కాంత్ తన వైఖరి ఖరాకండిగా చెప్పారు. ఈ సున్నితమైన అంశాన్ని పట్టించుకోకుండా ఉండలేమని అన్నారు.
ఈ సందర్భంగా పాడ్‌కాస్టర్ రణ్‌వీర్ అలహాబాదియా(Podcast Ranveer Allahbadia)పై సుప్రీంకోర్టు(Supreme Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. భావప్రకటనా స్వేచ్ఛ పేరుతో ఏది పడితే అది మాట్లాడటానికి మీకు లైసెన్స్ ఉందా? అని సుప్రీం మండిపడింది. సమాజానికి కొన్ని విలువలు ఉన్నాయని.. ‘ఇండియాస్ గాట్ లాటెంట్’ షోలో రణ్‌వీర్ చేసిన వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయని అన్నారు. థానేలో పాస్‌పోర్టు సరెండర్ చేయాలని ఆదేశించింది. ఇక ఈ వ్యవహారంలో మరో పోలీసు కేసు నమోదు చేయొద్దని ఆదేశాలు ఇచ్చింది. కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచివెళ్లే ప్రయత్నాలు చేయొద్దని రణ్‌వీర్‌ను హెచ్చరించింది. అంతేకాదు.. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఎలాంటి షోలు చేయకూడదని తేల్చిచెప్పింది.