నేడు కేజ్రీవాల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ

by Anjali |
నేడు కేజ్రీవాల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుమార్తె ఎమ్మెల్సీ కవితతో పాటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈయనతో పాటు ఈడీ ఆమ్ ఆద్మీ పార్టీని కూడా చార్జ్ షీట్‌లో నిందితులుగా చేసింది. ఈ లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్‌ను కుట్రదారుడిగా, కింగ్‌పిన్ గా ఈడీ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా గోవా ఎలక్షన్లో లంచం సొమ్ము వినియోగించుకుంటున్నట్లు తమకు సమాచారం అందిందని ఈడీ వెల్లడించింది. అయితే కేజ్రీవాల్ మనీ లాండరింగ్ కేసులో రోజుకో మలుపు తిరుగుతుంది. మంగళవారం కోర్టు ఈడీ ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో ఢిల్లీ సీఎం ను కోర్టు 12 వ తారీకున హాజరుకావాలని సమన్లు పంపించింది. వ్యక్తిగతంగా కోర్టులో హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. నేడు అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా తీర్పు వెల్లడించనున్నారు. ప్రస్తుతం ఢిల్లీ ముఖ్యమంత్రి తీహార్ జైలులో ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed