Supreme Court: మోడీ డాక్యుమెంటరీపై విచారణ వాయిదా

by Shamantha N |   ( Updated:2024-10-21 11:35:46.0  )
Supreme Court: మోడీ డాక్యుమెంటరీపై విచారణ వాయిదా
X

దిశ, నేషనల్ బ్యూరో: బీబీసీ డాక్యుమెంటరీ ‘ఇండియా: మోడీ క్వశ్చన్‌’పై కేంద్రం నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. 2025 జనవరికి విచారణను వాయిదా వేసింది. కేంద్రం ఇచ్చిన కౌంటర్ అఫిడవిట్‌ను ఇంకా నమోదు చేయకపోవడంతో విచారణ వాయిదా పడింది. జస్టిస్‌లు సంజీవ్ ఖన్నా, సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కాగా.. కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేస్తామని తెలిపారు.

గుజరాత్ అల్లర్లు

2022లో గుజరాత్ అల్లర్లకు సంబంధించి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉద్దేశించి బీబీసీ తీసిన డాక్యుమెంటరీ సిరీస్‌ తీసింది. అయితే, ఆ సిరీస్ విడుదల కలకలం రేపింది. ‘ఇండియా: ది మోడీ క్వశ్చన్’ ప్రధాని మోడీని కించపరిచే విధంగా ఉందంటూ కేంద్ర ప్రభుత్వం ఈ సిరీస్ పై నిషేధం విధించింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ డాక్యుమెంటరీని “ప్రచార భాగం”గా పేర్కొంది. అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వివాదాస్పద డాక్యుమెంటరీని కేంద్రం బ్లాక్ చేసింది.

Advertisement

Next Story

Most Viewed