- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఢిల్లీకి కాబోయే సీఎం సునీతా కేజ్రీవాలే.. కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
దిశ, నేషనల్ బ్యూరో : ఢిల్లీ ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ సిద్ధమవుతున్నారని కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్ పురి పేర్కొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీలోని ఎవరి అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా సీఎం పదవిని చేపట్టేందుకు సునీత రంగం సిద్ధం చేసుకుంటున్నారని ఆయన తెలిపారు. దాణా కుంభకోణంలో లాలూప్రసాద్ యాదవ్ జైలు పాలైనప్పుడు బిహార్‌లో రబ్రీ దేవి కూడా ఇలాగే చేశారన్నారు. అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసినప్పటి నుంచి ఆయన కుర్చీలో కూర్చొని ఒక్క సునీతా కేజ్రీవాల్ మాత్రమే వీడియో సందేశాలను విడుదల చేస్తున్న విషయాన్ని కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్ గుర్తుచేశారు. లిక్కర్ ఆదాయంపై ప్రభుత్వాలు ఆధారపడకూడదని అన్నాహజారే ఉద్యమం టైంలో గొంతు చించుకున్న అరవింద్ కేజ్రీవాల్.. ఢిల్లీ సీఎం అయ్యాక లిక్కర్ డబ్బుల మాయలో చిక్కుకొని జైలుపాలయ్యారని తెలిపారు.