Punjab: మాజీ డిప్యూటీ సీఎంకు కఠిన శిక్ష.. బాత్‌రూమ్‌లు కడుగుతున్న సుఖ్‌బీర్ సింగ్

by Ramesh Goud |
Punjab: మాజీ డిప్యూటీ సీఎంకు కఠిన శిక్ష.. బాత్‌రూమ్‌లు కడుగుతున్న సుఖ్‌బీర్ సింగ్
X

దిశ, వెబ్ డెస్క్: అకల్‌ తఖ్త్(Akal Thakth) విధించిన కఠిన శిక్ష(Punishment)లో భాగంగా పంజాబ్ మాజీ ఉపముఖ్యమంత్రి(Panjab EX Duputy CM) సుఖ్‌బీర్ సింగ్ బాదల్(Sukhbir Singh Badal) బాత్ రూంలు(Bathroom Cleaning) కడిగారు. శిరోమణి అకాలీదళ్ మాజీ అధ్యక్షుడు(Shiromani Akalidal EX President) సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌ 2007 నుంచి 2017 వరకు అధికారంలో ఉండగా చేసిన తప్పులకు సోమవారం క్షమాపణలు చెప్పారు. దీంతో అకల్ తఖ్త్ (సిక్కుల అత్యున్నత తాత్కాలిక సంస్థ) ఆధ్వర్యంలోని సిక్కుల ఐదుగురు ప్రధాన పూజారులు సుఖ్ బీర్ సింగ్ తంఖయ్య(మతపరమైన దుష్ప్రవర్తనలకు పాల్పడటం ) చేసినట్లు ప్రకటించారు. బాదల్ చేసిన తప్పులకు అతనికి కఠిన శిక్ష విధించారు. అమృత్ సర్ గోల్డెన్ టెంపుల్ సహా, ఇతర గురుద్వారాలలో బాత్ రూంలు, కిచెన్ లు శుభ్రం చేయాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో సుఖ్ బీర్ సింగ్ బాదల్ మంగళవారం మెడలో ట్యాగ్ ను ధరించి శిక్షను అనుభవిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.

Advertisement

Next Story