- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సూడాన్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు..
న్యూఢిల్లీ: సూడాన్‌లో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. దీనిపై భారత్ గురువారం ఆందోళన వ్యక్తం చేసింది. భారతీయుల భద్రత కోసం వివిధ దేశాలతో చర్చలు జరుపుతోంది. సూడాన్‌లో పరిస్థితిని భారత్ నిశితంగా పరిశీలిస్తోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. ‘పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. భారతీయుల భద్రతపై దృష్టి పెట్టాం. వివిధ మార్గాల ద్వార భారతీయులతో టచ్‌లో ఉన్నాం. ఖార్టూమ్‌లోని భారత రాయబార కార్యాలయం తెరిచే ఉంది. కానీ అందులో ఎవరూ లేరు. అయితే ప్రత్యేక ప్రదేశాల నుంచి పనిచేస్తున్న అధికారులతో అన్ని సేవలు అందిస్తోంది’ అని ఆయన చెప్పారు. న్యూయార్క్‌లో యూఎన్ ప్రధాన కార్యదర్శిని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కలిసి సూడాన్‌లో పరిస్థితిని చర్చించనున్నట్టు బాగ్చి తెలిపారు.
ప్రస్తుతం జైశంకర్ న్యూయార్క్‌లో ఉన్నట్టు ఆయన చెప్పారు. భారతీయుల భద్రతే తమ తొలి ప్రధాన్యత అని అన్నారు. సూడాన్‌లోని భారతీయులకు రక్షణ కల్పించేందుకు భారత ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేస్తోంది. యూఏఈ, సౌదీ అరేబియాతో ఇప్పటికే చర్చలు జరిపింది. ఈ రెండు దేశాలూ భారతీయులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చాయి. అటు అమెరికా, బ్రిటన్‌తో కూడా చర్చలు కొనసాగుతున్నాయి. సౌదీ, యూఏఈ మాత్రం భారత్‌కు మద్దతుగా నిలిచాయి.
సూడాన్‌లోని ఇండియన్ ఎంబసీ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. భారతీయులెవరూ బయటకు రావద్దని సూచించింది. శాంతియుత వాతావరణానికి సహకరించాలని కోరింది. ఇప్పటికే ఈ సమస్య పరిష్కారానికి ఢిల్లీలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌ను కేంద్రం ఏర్పాటు చేసింది. కాగా యుద్ధం చేస్తున్న సూడాన్ ఆర్మీ, పారా మిలిటరీతో భారత్ చర్చలు జరుపుతోంది. భారతీయులను సురక్షితంగా బయటికి తెచ్చేందుకు వివిధ మార్గాలను కూడా భారత్ అణ్వేషిస్తోంది.
- Tags
- Sudan conflict