- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూ.500కే గ్యాస్ సిలిండర్.. ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ
రాయ్‌పూర్: రాష్ట్రంలో కాంగ్రెస్‌ను మరోసారి అధికారంలోకి తీసుకొస్తే మహిళలకు సబ్సిడీ కింద రూ.500కే గ్యాస్ సిలిండర్ అందజేస్తామని పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ హామీనిచ్చారు. ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖైరాగఢ్ నియోజకవర్గంలో సోమవారం నిర్వహించిన ర్యాలీలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా పలు హామీలను ప్రకటించారు. తమను తిరిగి గెలిపిస్తే, దాదాపు 6వేల ప్రభుత్వ హయ్యర్ సెకండరీ, ఉన్నత పాఠశాలలను స్వామి ఆత్మానంద ఇంగ్లీష్, హిందీ మీడియం పాఠశాలలుగా అప్‌గ్రేడ్ చేస్తామని వెల్లడించారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందజేస్తామని చెప్పారు.
మహిళల స్వయం సహాయక గ్రూపుల లోన్లను మాఫీ చేస్తామని వెల్లడించారు. అంతేకాకుండా, సీఎం ప్రత్యేక ఆరోగ్య సహాయ పథకం కింద రోడ్డు ప్రమాద బాధితులకు ఉచితంగా చికిత్స అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బీజేపీపై విమర్శలు గుప్పించారు. ‘మతం పేరుతో తప్పుదారి పట్టిస్తూ.. మీ జీవితాల్లోకి సమస్యలను మాత్రమే తెచ్చే పార్టీకి ఓటేస్తారా..? లేక మీ అభివృద్ధి, సంక్షేమం కోసం పనిచేసే పార్టీకి ఓటేస్తారా’ అంటూ ప్రజలను అడిగారు.