Kolkata rape horror: మమతాకు వ్యతిరేకంగా పోస్టు.. విద్యార్థిని అరెస్టు

by Shamantha N |   ( Updated:2024-08-19 09:48:17.0  )
Kolkata rape horror:  మమతాకు వ్యతిరేకంగా పోస్టు.. విద్యార్థిని అరెస్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: కోల్ కతా హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా ఢిల్లీలో వైద్యులు వినూత్న నిరసనను ప్రకటించారు. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) సహా ఇతర ఆస్పత్రుల రెసిడెంట్ వైద్యులు ప్రత్యేక ఓపీడీ సేవలు అందించి నిరసన చేపట్టనున్నారు. సోమవారం నుంచి ఢిల్లీలోని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యాలయంలోని నిర్మాణ్ భవన్ ముందు రోడ్డుపై ఓపీడీ సేవలు అందించి నిరసన దీక్ష చేపట్టనున్నారు. ఈ మేరకు రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్(ఆర్డీఏ) ఓ ప్రకటన విడుదల చేసింది. తమ డిమాండ్లను ఇంకా పరిష్కరించలేదని.. అందుకే సమ్మె కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు ఆర్డీఏ ఏయిమ్స్ పేర్కొంది.

ఆర్డీఏ ఏమందంటే?

అయితే, నిర్మాణ్ భవన్ వెలుపల ఉన్న రోగులకు కొన్నిరకాల ఓపీడీ సేవలు అందించేందుకు వైద్యులు అందుబాటులో ఉంటారని ఆర్డీఏ తెలిపింది. అయితే అన్ని ఆస్పత్రుల్లో అత్యవసర సేవలు మునుపటిలానే కొనసాగుతాయని వెల్లడించింది. నిర్మాణ్ భవన్ వెలుపల ఓపీడీ సేవల కోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆర్డీఏ ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. దేశ ప్రయోజనాల దృష్ట్యా నిబందనలు పాటిస్తూ రోగుల సంరక్షణ సేవలు అందిస్తామంది. కానీ, దేశవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ నిపుణులకు భద్రత లోపించడాన్ని హైలెట్ చేయాలనుకుంటున్నామని వెల్లడించింది. హెల్త్ కేర్ రంగంలోని వారి భద్రత కోసం కేంద్రం అత్యవసరంగా ఆర్డినెన్స్ ని తీసుకురావాలని కోరింది. అంతకుముందు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) పిలుపునిచ్చిన 24 గంటల దేశవ్యాప్త సమ్మె ఆదివారం ఉదయం 6 గంటలకు ముగిసింది. అయితే, ట్రైనీ డాక్టర్‌కు న్యాయం చేయాలని వైద్యులు పోరాటం కొనసాగించారు.

Advertisement

Next Story

Most Viewed