- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పూరి రత్నభండాగారం తెరుస్తోండగా అస్వస్థతకు గురైన ఎస్పీ!.. సొమ్మసిల్లి పడిపోయిన ఎస్పీ పినాక్ మిశ్రా
దిశ, డైనమిక్ బ్యూరో: ఒడిశాలో పూరి జగన్నాధుడి రత్నభండాగారాన్ని 11 మందితో కూడిన బృంధం ఇవ్వాళ మధ్యాహ్నం 1.28 గంటలకు తెలిచారు. దీనికోసం అంతకుముందు ఆలయంలో ప్రధాన పూజారులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రత్నభండాగారం గది తలుపులు తెరిచేందుకు అధికారులు ప్రయత్నించారు. అయితే గది తలుపులు తెరిచే సమయంలో ఎస్పీ పినాక్ మిశ్రా కొంత అస్వస్థతకు గురయ్యారు. గదిలోనే సొమ్మసిల్లి పడిపోయారు. అక్కడే ఉన్న ఎమర్జెన్సీ డాక్టర్ వారికి ప్రథమ చికిత్స చేయడంతో ఆయన తిరిగి కోలుకున్నారు.
అనంతరం గది తలుపులు తెరిచి 11 మంది మాత్రమే లోపలికి వెళ్లారు. లోపలికి వెళ్లిన వారిలో రత్నభాండాగారంపై ఒడిశా ప్రభుత్వం నియమించిన కమిటీ చైర్మన్ జస్టిస్ బిశ్వనాథ్ రథ్, కమిటీ సభ్యుడు సీబీకే మహింతి, ఆలయ పాలనా అధికారి అరవింద్ పాడీ, పూరి జిల్లా కలెక్టర్ సిద్ధార్థ శంకర్ స్వైన్, పురావస్తు శాఖ ఇంజనీర్ ఎన్సీ పాల్, పూరి రాజప్రతినిధితో పాటు ఐదుగురు ఆలయ అధికారులు ఉన్నారు. వీరితో పాటు స్నేక్ క్యాచర్స్, ఎమర్జెన్సీ వైద్యుల బృందంతో పాటు రెస్క్యూ టీంతో కూడిన 40 మంది బృందాన్ని కూడా వారి వెంట తీసుకెళ్లారు. అయితే వీరిని ఎదైన అత్యవసర సమయంలో లోపలికి తీసుకెళ్లాలని నిర్ణయించి, ప్రస్తుతానికి ద్వారం బయటే ఉంచారు. 4 దశాబ్దాల తర్వాత గది తలుపులు తెరవడంతో ఖజానా ఉంచిన చెక్క పెట్టేలు పాడై ఉంటాయని భావించి, ప్రత్యేకంగా తయారు చేయించిన 6 చెక్క పెట్టెలను ఆలయ ద్వారం వద్ద రెడీగా ఉంచారు.
బయటకి తీసిన నిధిని లెక్కింపు అనంతరం ఈ చెక్క పెట్టెల్లో భద్రపరచనున్నారు. ప్రస్తుతం లోపలికి వెళ్లిన అధికారులు చెక్క పెట్టేలను పరిశీలించే పనిలో ఉన్నారు. అనంతరం అక్కడే లెక్కించడానికి వీలు అవుతుందా.. లేక వేరే చోటుకి మార్చాలా అనేది నిర్ణయించనున్నారు. కాగా ఖజానా సంబందించిన వివరాలు ఇప్పట్లో వెల్లడించేది లేదని, పూర్తి లెక్కింపు తర్వాతే వివరాలు బయటపెడతామని ఒడిశా ప్రభుత్వం చెప్పినట్లు తెలుస్తోంది. ఈ రత్న భండాగారానికి సంబందించిన ఖజానా వివరాలను ఆన్ లైన్ లో పొందుపరుస్తామని ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. గది లోపలికి వెళ్లిన అధికారులు బయటకి వస్తే.. నిధికి సంబందించిన వివరాలు తెలిసే అవకాశం ఉంది.