Breaking News : సైనిక పాలన విధించిన దక్షిణ కొరియా

by M.Rajitha |
Breaking News : సైనిక పాలన విధించిన దక్షిణ కొరియా
X

దిశ, వెబ్ డెస్క్ : దక్షిణ కొరియా(South Korea) సంచలన నిర్ణయం తీసుకుంది. ఉత్తర కొరియాతో కలిసి ప్రతిపక్షాలు దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నాయనే ఆరోపణలతో ఎమర్జెన్సీ మార్షల్ లా(Emergency Martial Law) విధించింది. ఈ మేరకు దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్(Yonn Suk Yeol) వార్తా ఛానెల్స్ ద్వారా దేశంలో సైనిక పాలన విధిస్తున్నట్టు ప్రకటించారు. ఉత్తర కొరియా(North Korea) అండతో విపక్షాలు దేశ పార్లమెంటును కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తున్నాయని, అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వస్తోందని స్పష్టం చేశారు. అయితే ఈ ప్రకటనపై ప్రతిపక్షాలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. 2022లో యూన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.

Advertisement

Next Story

Most Viewed