ఢిల్లీలో కలకలం.. స్కూలుకు బాంబు బెదిరింపులు

by srinivas |
ఢిల్లీలో కలకలం.. స్కూలుకు బాంబు బెదిరింపులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలోని ఓ ప్రైవేటు పాఠశాలకు బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. దక్షిణ ఢిల్లీలో పుష్పవిహార్‌ ప్రాంతంలోని అమృత పాఠశాలకు మంగళవారం ఉదయం 6.35 గంటలకు ఈ-మెయిల్‌ ద్వారా బెదిరింపులు వచ్చాయని అధికారులు తెలిపారు. దీంతో అప్రమత్తమైన యాజమాన్యం వెంటనే పోలీసులకు సమాచారం అందించి...పాఠశాలను ఖాళీ చేయించింది. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, బాంబ్‌ స్క్వాడ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. అయితే, ఇప్పటి వరకు ఎటువంటి పేలుడు పదార్థాలు లభించలేదని పోలీసులు తెలిపారు. కాగా, ఇటీవల ఢిల్లీ పాఠశాలలకు వరుస బాంబు బెదిరింపులు వస్తున్నాయి. నెల రోజుల వ్యవధిలో ఇది మూడో ఘటన కావడం గమరార్హం. ఏప్రిల్‌లో మథురా రోడ్‌లోని ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌, సాదిఖ్ నగర్‌లోని ఇండియన్‌ పబ్లిక్‌ స్కూల్‌కు ఇదే తరహాలో మెయిల్స్ వచ్చాయి. అప్పుడు కూడా ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు.

Advertisement

Next Story

Most Viewed