Tallest Skydeck : దక్షిణాసియాలోనే ఎత్తైన ‘స్కై డెక్’ మన బెంగళూరులో

by Hajipasha |
Tallest Skydeck : దక్షిణాసియాలోనే ఎత్తైన ‘స్కై డెక్’ మన బెంగళూరులో
X

దిశ, నేషనల్ బ్యూరో : ‘స్కై డెక్’ .. కాళ్ల కింద అద్దాలు, చుట్టూ అద్దాల నడుమ నిలబడి నగరం మొత్తాన్ని పక్షిలా ఏకకాలంలో వీక్షించే అవకాశం కల్పించే గొప్ప వేదిక. రూ.500 కోట్లతో బెంగళూరు నగరంలో భారీ స్కై డెక్ నిర్మాణ ప్రతిపాదనకు కర్ణాటక రాష్ట్ర క్యాబినెట్ గురువారం పచ్చజెండా ఊపింది. దీని నిర్మాణం వల్ల రాష్ట్ర రాజధాని బెంగళూరులో మౌలిక సదుపాయాల రంగానికి మరింత ఊతం లభిస్తుందని ప్రభుత్వం వెల్లడించింది.

నగరంలో నిర్మించనున్న స్కై డెక్ ఎక్కితే 360 డిగ్రీల వ్యూలో బెంగళూరు మొత్తాన్ని వీక్షించే అవకాశం లభిస్తుందని తెలిపింది. స్కైడెక్ దాదాపు 250 మీటర్ల ఎత్తు ఉంటుందని కర్ణాటక సర్కారు పేర్కొంది. ఢిల్లీలోని కుతుబ్ మినార్ ఎత్తు 73 మీటర్లే ఉంటుందని గుర్తు చేసింది. అంటే దాని కంటే మూడు రెట్లు ఎక్కువ ఎత్తులో స్కైడెక్‌ను నిర్మించబోతున్నారన్న మాట. ఇది దక్షిణాసియాలోనే అత్యంత ఎత్తైన స్కై డెక్‌గా నిలువనుంది.

Advertisement

Next Story

Most Viewed