ప్రతి ఓటు విలువైనదే.. ఢిల్లీ ఎన్నికలకు ముందు సోనియా గాంధీ వీడియో సందేశం

by Harish |
ప్రతి ఓటు విలువైనదే.. ఢిల్లీ ఎన్నికలకు ముందు సోనియా గాంధీ వీడియో సందేశం
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ శనివారం ఢిల్లీలో జరగనున్న ఎన్నికలకు ముందు ప్రజలకు ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈ ప్రసంగంలో ఢిల్లీ ప్రజలను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ, ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఈ ఎన్నికలు చాలా ముఖ్యమైనవి. ఇవి ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడే ఎన్నికలు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, రాజ్యాంగ సంస్థలపై దాడులు వంటి సమస్యలపై పోరాడటానికి జరుగుతున్నాయి. ఈ పోరాటంలో ప్రజలు తమ వంతు పాత్ర పోషించాలని సోనియా అన్నారు. మీ ప్రతి ఓటు ఉపాధిని సృష్టిస్తుంది, ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తుంది, మహిళలను శక్తివంతం చేస్తుంది, సమానత్వం కూడిన భారతదేశాన్ని సృష్టిస్తుంది, ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాల్లో కాంగ్రెస్, ఇండియా కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని సోనియా గాంధీ వీడియో సందేశంలో కోరారు.

మే 25న దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికలు జరగనున్నాయి. గురువారంతో ఢిల్లీలో ప్రచారం ముగిసింది. మొత్తం ఏడు లోక్‌సభ స్థానాల్లో బీజేపీ, ఇండియా కూటమి మధ్య పోరు జరగనుంది. ఈ ఎన్నికలలో కాంగ్రెస్, ఆమ్‌ ఆద్మీ పార్టీ కలిసి పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్ చాందినీ చౌక్, ఈశాన్య ఢిల్లీ, నార్త్ వెస్ట్ ఢిల్లీ నుంచి అభ్యర్థులను నిలబెట్టగా, ఆప్ మిగిలిన నాలుగు స్థానాల్లో తన అభ్యర్థులను పోటీకి దింపింది.

Advertisement

Next Story

Most Viewed