- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Wayanad: వయనాడ్ ఉప ఎన్నిక ప్రచారానికి సోనియా గాంధీ
దిశ, నేషనల్ బ్యూరో: తొలిసారి ఎన్నికల బరిలో నిలబడుతున్న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ కోసం ఆమె తల్లి, పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రచారం చేయనున్నారు. ప్రియాంకా గాంధీ కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. చాలా సంవత్సరాల తర్వాత సోనియా గాంధీ కేరళకు వెళ్లనున్నారు. ఈ నెల 22న రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీతో కలిసి రోడ్‌షోలో పాల్గొంటారని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ స్థానం నుంచి గెలిచిన రాహుల్ గాంధీ, సమీప ప్రత్యర్థి కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన అన్నీ రాజాపై 3,64,422 ఓట్ల తేడాతో గెలిచారు. ఈ ఎన్నికల్లో వయనాడ్‌తో పాటు రాయ్‌బరేలీ స్థానాన్ని కూడా రాహుల్ గాంధీ గెలిచిన కారణంగా వయనాడ్ స్థానాన్ని వదులుకున్న సంగతి తెలిసిందే. దాంతో వయనాడ్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక అవసరమైంది. నవంబర్ 13న పాలక్కాడ్, చెలక్కర అసెంబ్లీ స్థానాలతో పాటు వయనాడ్ లోక్‌సభ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనుంది.