- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్టార్ క్యాంపెయినర్లు గా సోనియా, మన్మోహన్
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ సన్నాహాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో మొదటి దశ ఎన్నికలకు 30 మంది కీలక నేతలతో ప్రచారం చేయనున్నట్లు సోమవారం పార్టీ ప్రకటించింది. వీరిలో స్టార్ క్యాంపెయినర్లుగా కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, మాజీ పీఎం మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, గులాం నబీ అజాద్, ఆర్పీఎన్ సింగ్‌తో పాటు రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ సీఎంలు అశోక్ గెహ్లట్, భూపేష్ బాఘేల్‌లు ఉన్నారు. ఇక గతేడాది పార్టీలో చేరిన జేఎన్‌యూ మాజీ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ కూడా ప్రచారంలో పాల్గొననున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా జీ-23 నేతలలో కొందరిని ప్రచారాల్లో పాల్గొనాలని సోనియా గాంధీ ఇప్పటికే లేఖ రాసినట్లు తెలిపింది.
కోవిడ్-19 ఆందోళనల నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ వర్చువల్ ప్రచారంతో పాటు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహిస్తోంది. కాగా, సీనియర్ లీడర్లు ఇంటింటి ప్రచారం తో పాటు, చిన్న చిన్న సమావేశాల్లోనే పాల్గొనేలా ఏర్పాటు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ఇప్పటికే కాంగ్రెస్ రెండు విడుతలుగా అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా మహిళలు, యువతను ఆకట్టుకునేలా ఇప్పటికే కాంగ్రెస్ హామీలు ఇచ్చింది. దీంతో పాటు పోటీ చేసే అభ్యర్థుల్లోనూ 40 శాతం మహిళలకు చోటు కల్పిస్తున్నట్లు ప్రకటించింది.