- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Somanath: స్పేస్‌పై రూపాయి ఖర్చుకు రెండున్నర రూపాయల లాభం.. ఇస్రో చీఫ్ సోమనాథ్
దిశ, నేషనల్ బ్యూరో: అంతరిక్షరంగంపై ప్రతి రూపాయి ఖర్చుకు రెండున్నర రూపాయల లాభం వచ్చిందని ఇస్రో చీఫ్ సోమనాథ్ (Somanath) తెలిపారు. 2040 నాటికి చంద్రునిపై వ్యోమగామిని దింపాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని చెప్పారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పనులను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. మంగళవారం ఆయన ఓ మీడియా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘ఇస్రో కోసం ప్రధాని మోడీ (Pm modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రూ. 31 వేల కోట్లను రిలీజ్ చేసింది. దీంతో రాబోయే 15 సంవత్సరాలలో దేశ అంతరిక్ష ప్రయత్నాల కోసం దీర్ఘకాలిక దృష్టిని రూపొందించాం. ఈ ఏడాది మాకు గొప్పగా ఉందని విశ్వసిస్తున్నాం. మోడీ దార్శనికతను బట్టి భవిష్యత్ రోడ్ మ్యాప్ కూడా నిర్ణయిస్తాం. అంతరిక్ష చరిత్రలో మొదటి సారిగా రాబోయే 25 ఏళ్లకు విజన్ ఉంది’ అని వ్యాఖ్యానించారు.
ఈ ప్రణాళిక ఆధారంగా 2035 నాటికి భారత్ తన సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుందని దీమా వ్యక్తం చేశారు. దీనికి గాను 2028 నుంచి ఏర్పాట్లు ప్రారంభమవుతాయని చెప్పారు. అంతేగాక చంద్రునిపైకి మనుషులను పంపాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ ఘనతను సాధిస్తామన్నారు. ఆ టైంలో చంద్రునిపై భారత జెండా ఎగురుతుందని నొక్కి చెప్పారు. దేశానికి చెందని ఒక వ్యక్తి అక్కడికి వెళ్లి జాతీయ పతాకాన్ని ఎగురవేసి తిరిగి వస్తారని నొక్కి చెప్పారు. అంతేగాక చంద్రయాన్-4కు సంబంధించిన పనులు సైతం జరుగుతున్నాయని తెలిపారు.