బహుళత్వం, వైవిధ్యాన్ని లాక్కుంటున్న మోడీ: అసదుద్దీన్ ఒవైసీ

by Vinod kumar |
బహుళత్వం, వైవిధ్యాన్ని లాక్కుంటున్న మోడీ: అసదుద్దీన్ ఒవైసీ
X

హైదరాబాద్: దేశ ప్రజల్లోని వైవిధ్యం, బహుళత్వాన్ని లాక్కోవాలని ప్రధాని మోడీ చూస్తున్నారని మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. ‘హిందూ అవిభక్త కుటుంబం నిబంధన కింద హిందువులకు మాత్రమే పన్ను రాయితీ ఉంది. 300 మంది బీజేపీ ఎంపీల అండ ఉన్న ప్రధాని మోడీకి ఈ పన్ను రాయితీని రద్దు చేసే దమ్ము ఉందా..? యూనిఫాం సివిల్ కోడ్ గురించి పంజాబ్ వెళ్లి అక్కడి సిక్కులకు చెప్పండి. వాళ్లు ఏమంటారో చూడండి.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్-29 ప్రకారం సంస్కృతి హక్కు అనేది ప్రజల ప్రాథమిక హక్కు. ప్రధాని మోడీకి ఇది అర్ధమైందా..?’ అని ఒవైసీ ఎద్దేవా చేశారు. ‘ఇస్లాంలో వివాహం అనేది ఒక కాంట్రాక్టు. ముస్లింల పెళ్లి ఇతర మతాలకు భిన్నంగా ఉంటుంది. వాటన్నింటినీ మిక్స్ చేయడం సరికాదు’ అని స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed