‘ఒకే దేశం.. ఒకే శాసన వేదిక’ .. ప్రధాని మోడీ ప్రకటన

by Hajipasha |   ( Updated:2024-01-27 17:36:38.0  )
‘ఒకే దేశం.. ఒకే శాసన వేదిక’ .. ప్రధాని మోడీ ప్రకటన
X

దిశ, నేషనల్ బ్యూరో : పార్లమెంటు సమావేశాల్లో కొందరు విపక్ష సభ్యులు రాద్ధాంతం చేస్తున్నా వారు ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ పార్టీలు గుడ్డిగా సమర్ధించుకుంటున్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. చట్టసభల్లో సభా నిబంధనలను సభ్యులు ఉల్లంఘించినా వారిని రాజకీయ పక్షాలు సమర్ధించుకోవడమనే ధోరణి పార్లమెంటుకు, రాష్ట్రాల శాసనసభలకు మంచిది కాదని హెచ్చరించారు. శాసనసభ ప్రతిష్ఠ దాని సభ్యుల ప్రవర్తనపైనే ఆధారపడి ఉంటుందన్నారు. ముంబైలో జరిగిన 84వ ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్‌‌ను ఉద్దేశించి ప్రధాని మోడీ వర్చువల్‌గా ప్రసంగించారు. ‘‘2021లో మీతో చర్చల సందర్భంగా నేను ‘ఒకే దేశం ఒకే శాసన వేదిక’ గురించి ప్రస్తావించాను. ఈ-విధాన్,డిజిటల్ సంసద్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా మనదేశ పార్లమెంటు, రాష్ట్రాల శాసనసభలు ఇప్పుడు ఈ లక్ష్యం కోసం పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉంది’’ అని చెప్పారు. ‘ఒకే దేశం ఒకే శాసన వేదిక’ ప్రాజెక్ట్‌లో భాగంగా దేశంలోని అన్ని చట్టసభల కార్యకలాపాలను ఒకే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు.

Advertisement

Next Story