దేశద్రోహ చట్టం ఉండాల్సిందే: లా కమిషన్ చీఫ్

by Vinod kumar |
దేశద్రోహ చట్టం ఉండాల్సిందే: లా కమిషన్ చీఫ్
X

న్యూఢిల్లీ: వలస రాజ్యాల కాలం నాటి దేశద్రోహ చట్టాన్ని రద్దు చేయాలన్న డిమాండ్‌ను లా కమిషన్ చైర్మన్ జస్టిస్ రీతురాజ్ అవస్తి వ్యతిరేకించారు. కశ్మీర్ నుంచి కేరళ వరకు, పంజాబ్ నుంచి ఈశాన్యం వరకు దేశంలో ప్రస్తుత పరిస్థితి నేపథ్యంలో ‘భారత భద్రత-సమగ్రత’ను కాపాడేందుకు దేశద్రోహ చట్టాన్ని కొనసాగించాల్సిందే అన్నారు. అయితే.. ప్రస్తుత దేశద్రోహ చట్టాన్ని నిలుపుదల చేసిన సుప్రీం కోర్టు దీంట్లో మార్పులు చేయాలన్న సూచనలను రీతురాజ్ సమర్ధించారు.

ఈ చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా కొన్ని రక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం, జాతీయ భద్రతా చట్టం వంటి ప్రత్యేక చట్టాలు దేశద్రోహ నేరాన్ని కవర్ చేయలేవని, దేశద్రోహానికి ప్రత్యేక చట్టం ఉండాల్సిందేనని రీతురాజ్ స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed