‘సియాచిన్’ పై తొలిసారిగా మొబైల్ టవర్..

by Vinod kumar |
‘సియాచిన్’ పై తొలిసారిగా మొబైల్ టవర్..
X

న్యూఢిల్లీ : ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధభూమి ‘సియాచిన్’ గ్లేసియర్‌పై తొలిసారిగా మొబైల్ టవర్, బేస్ ట్రాన్స్‌సీవర్ స్టేషన్ (బీటీఎస్)లను భారత్ ఏర్పాటు చేసింది. బీఎస్ఎన్ఎల్ సహకారంతో భారత సైన్యం అక్టోబర్ 6న ఈ ఏర్పాట్లు చేయించింది. దీంతో ఇకపై సియాచిన్ ప్రాంతంలో డ్యూటీ చేసే భారత సైనికులకు టెలికాం సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఫలితంగా రానున్న రోజుల్లో సియాచిన్ వద్ద విధులు నిర్వర్తించే సైనికులు తమ ఉన్నతాధికారులు, కుటుంబ సభ్యులతో ఎప్పుడైనా మాట్లాడుకునే వెసులుబాటు కలుగనుంది.

‘‘సియాచిన్‌లో మొబైల్‌ టవర్‌‌ను ఏర్పాటు చేయడమనేది చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ దిగిన దానితో సమానం. అత్యంత ఎత్తైన ఆ యుద్ధభూమిలో ప్రాణాలను పణంగా పెట్టి ప్రతిరోజూ డ్యూటీ చేసే సైనికులు.. ఇప్పుడు అక్కడి నుంచే తమ కుటుంబాలతో కనెక్టయ్యే అవకాశం దక్కడం సంతోషకరం’’ అని పేర్కొంటూ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా శుక్రవారం ట్వీట్ చేశారు.

Advertisement

Next Story