Shraddha హత్య కేసు: 3 వేల పేజీల ఛార్జిషీటు.!

by Hajipasha |   ( Updated:2023-01-22 11:12:28.0  )
Shraddha హత్య కేసు: 3 వేల పేజీల ఛార్జిషీటు.!
X

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో పోలీసులు 3 వేల పేజీలతో కూడిన ఛార్జిషీటును సిద్ధం చేశారు. మూడు నెలలకు పైగా జరిపిన విచారణలో ముసాయిదా పత్రంలో 100 మందికి పైగా సాక్షుల వాంగ్మూలాలు ఉన్నాయని చెప్పారు. విచారణలో సేకరించిన కీలకమైన ఎలక్ట్రానిక్, ఫోరెన్సిక్ సాక్ష్యాలపై ఆధారపడి ఉందని వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా దీనిలో అఫ్తాబ్ నేరాన్ని అంగీకరించడం, నార్కో పరీక్ష ఫలితాలు, ఫోరెన్సిక్ పరీక్ష నివేదికలను కూడా పోలీసులు నమోదు చేశారు. ఇది ప్రస్తుతం న్యాయ నిపుణులు సమీక్షలో ఉందని తెలిపారు.

గత ఏడాది మే 18న అఫ్తాబ్ తనతో సహజీవనం చేస్తున్న శ్రద్ధావాకర్‌ను దారుణంగా హతమార్చాడు. అంతేకాకుండా మృతదేహాన్ని 35 ముక్కలుగా చేసి వివిధ ప్రాంతాల్లో పడేశాడు. అక్టోబర్‌లో శ్రద్ధా తండ్రి ఫిర్యాదుతో విచారణ చేపట్టగా.. ఈ ఉదంతం బయటపడింది. ఈ క్రమంలో అఫ్తాబ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు అతడు ఇచ్చిన సమాచారంతో శ్రద్ధా శరీర భాగాలను గుర్తించారు. వీటిని తండ్రి డీఎన్ఏతో పోల్చి చూడగా సరిపోలాయి. దీనిపై పలువురు సాక్ష్యులను విచారించిన అధికారులు ఛార్జిషీటు నమోదు చేశారు.

ఇవి కూడా చదవండి : సింగర్ Mangli కారుపై రాళ్ల దాడి

Advertisement

Next Story