- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Trump: 2020 ఎన్నికల ఓటమిపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
దిశ, నేషనల్ బ్యూరో: 2020 ఎన్నికల్లో ఓటమి గురించి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్(Trump) అన్నారు. తాను వైట్ హౌస్(White House) వీడకుండా ఉండాల్సిందని చెప్పుకొచ్చారు. ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏకధాటిగా పర్యటనలు చేశారు. పెన్సిల్వేనియాలోని లిటిజ్‌లో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో(US Polls) ప్రసంగించారు. ‘‘నేను పదవిని వీడే నాటికి అమెరికాకు అత్యంత సురక్షితమైన సరిహద్దులు ఉన్నాయి. నేను పదవి వీడాల్సింది కాదు. వైట్ హౌస్ ని కూడా వీడకుండా ఉండాల్సింది. మేం బాగా పనిచేశాం. అందుకే ఈసారి ప్రతి పోలింగ్‌బూత్ వద్ద వందలకొద్దీ లాయర్లు నిలబడి ఉన్నారు’’ అని అన్నారు. మరోవైపు, అయోవాలో కమలాహారిస్ ముందున్నారన్న పోల్ సర్వేలపై కూడా ట్రంప్ స్పందించారు. అటువంటి పోల్స్ ప్రత్యర్థిని పూర్తిగా అణచివేసేందుకే చేస్తారన్నారు. అవి పూర్తిగా చట్టవిరుద్ధమని అభిప్రాయపడ్డారు. ‘‘ఎవరైనా నన్ను దెబ్బతీయాలంటే.. తప్పుడు వార్తలను వాడతారు. నేను వాటిని అంతగా పట్టించుకోను’’ అని అన్నారు.
ట్రంప్ పర్యటనలు
ఇకపోతే, ట్రంప్ పెన్సిల్వేనియాలో గెలుస్తారన్న ఆయన వర్గం బలంగా నమ్ముతోంది. పెన్సిల్వేనియా నుంచి ట్రంప్ నార్త్ కరోలినాలోని కిన్‌స్టోన్‌కు బయల్దేరి వెళ్లారు. అక్కడ జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ‘‘హారిస్ ఎన్నికల్లో గెలిస్తే సరిహద్దులను పూర్తిగా తెరిచేస్తారు. దీంతో వలసదారులు, చొరబాటుదారులు, నేరగాళ్లు దేశంలోకి చొరబడతారు. ఆమెకు ఎలాంటి ముందుచూపు లేదు. అసలు ఆలోచనే ఉండదు. సమస్యల పరిష్కారం ఆమె వల్ల కాదు. ఆమె చెప్పే ప్రతిమాట అబద్ధమే. అన్నింటికీ ట్రంపే కారణమని మాత్రం చెబుతారు. ఆమె గెలిచిన రోజే సరిహద్దులు తెరుస్తారు. అదే నేను గెలిస్తే.. అమెరికన్లు దేశాన్ని పాలిస్తారు’’ అని పేర్కొన్నారు. ఇక, ఆ తర్వాత చివరగా ట్రంప్ జార్జియాలోని మకోన్ లో నిర్వహించిన సభలో ప్రసంగించారు. ‘‘ ఐ లవ్ జార్జియా. ఇక్కడికి రావడానికి ఇంట్రెస్టింగ్ గా ఉన్నా. అందరం కలిసి అమెరికాను మరోసారి ఉన్నతంగా తీర్చిదిద్దుదాం. ప్రస్తుతం మీరు బాగున్నారా..? నాలుగేళ్ల క్రితమా..?’’ అని ట్రంప్ తన మద్దతుదారులను ప్రశ్నించారు.