షాకింగ్ ఘటన.. పెంపుడు కోడి దాడిలో వ్యక్తి హతం

by Hamsa |
షాకింగ్ ఘటన.. పెంపుడు కోడి దాడిలో వ్యక్తి హతం
X

దిశ, వెబ్‌డెస్క్: ఐర్లాండ్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ పెంపుడు కోడి దాడికి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. ఐర్లాండ్‌లో జాస్పర్ క్రాస్ (67) అనే వ్యక్తిపై అతడి పెంపుడు కోడి ఒకటి జాస్పర్‌పై దాడి చేసింది.

దీంతో తీవ్ర రక్తస్రావం అయింది.. ఇదే సమయంలో అతనికి గుండెపోటు రావడంతో గతేడాది ఏప్రిల్ 28న మృతిచెందాడు. దాదాపు సంవత్సరం గడిచాక ఈ కేసులో షాకింగ్ నిజాలు వెల్లడయ్యాయి. జాస్పర్ కోడి దాడి చేసినందుకే మరణించినట్టు తెలిసింది. అంతే కాకుండా గతంలో కూడా ఆ కోడి అతడి కూతురిపై దాడికి పాల్పడిందని అతడి కూతురు తెలిపింది.

Advertisement

Next Story