పెళ్ళి జరుగుతున్న సమయంలో వేదిక వెనక్కి వెళ్లిన వరుడు.. అనుమానం వచ్చిన వధువు వెళ్లి చూడగా?

by Indraja |   ( Updated:2024-06-16 14:22:57.0  )
పెళ్ళి జరుగుతున్న సమయంలో వేదిక వెనక్కి వెళ్లిన వరుడు.. అనుమానం వచ్చిన వధువు వెళ్లి చూడగా?
X

దిశ వెబ్ డెస్క్: నూరేళ్ల జీవితానికి తోలి అడుగు పెళ్లి. అలాంటి పెళ్లి తంతులో చిన్నచిన్న సమస్యలు తలెతడం, చినుకు చినుకు కలిసి గాలివానగా మారినట్టు కొన్నిసార్లు ఆ చిన్న సమస్యలు సైతం పెద్ద గొడవలకు దారితీస్తాయి. ఇలా పెళ్లిపందిరిలో చోటుచేసుకున్న గొడవల నేపథ్యంలో వధూవరులు షాకింగ్ నిర్ణయాలు తీసుకున్న ఘటనలు కోకొల్లలు. అలాంటి ఘటనే తాజాగా ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని భదోహి జిల్లా, ఫత్తుపూర్ ప్రాంతానికి చెందిన షీలాదేవి కుమార్తె పింకీకి జౌన్‌పూర్ జిల్లా జయరాంపూర్‌కు చెందిన గౌతమ్‌తో వివాహం నిశ్చయమైంది. ఈ నేపథ్యంలో జూన్ 13వ తేది గురువారం వివాహం జరగాల్సి ఉంది. కాగా పెళ్లి తంతులో భాగంగా వరుడు వివాహానికి ఒక రోజు ముందే అనగా బుధవారం రాత్రి తన బంధుమిత్రులతో కలిసి వధువు గ్రామానికి చేరుకున్నారు.

అనంతరం వధూవరులు పెళ్లి దుస్తుల్లో కళ్యాణమంటపానికి చేరుకున్నారు. అప్పటి వరకు బంధుమిత్రుల సందడితో కన్నులపండుగగా ఉన్న కళ్యాణమండపంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. పెళ్లి జరుగుతున్న సమయంలో వేదికపై వధువు పక్కన ఉండాల్సిన వరుడు వేదిక వెనకకు వెళ్లారు. ఎంత సేపటికీ తిరిగి రాలేదు. దీనితో అనుమానం వచ్చిన వధువు వేదిక వెనకకు వెళ్లి చేడాగా.. వరుడు చేస్తున్న పనిని చూసి కంగుతింది.

జరిగేది తన పెళ్లి వేడుక అనే విషయాన్ని మరిచిపోయాడో ఏమోగాని, వధువును వేధికపై వదిలి, తాను వేదిక వెనకకు వచ్చి, తన స్నేహితులతో కలిసి మద్యం, గంజాయి సేవిస్తున్నాడు వరుడు. ఇది చూసి వధువుకు కోపం కట్టలు తెంచుకుంది. పెళ్లిలోనే తనను పక్కన పెట్టి మద్యం కోసం పరుగులు పెట్టిన వ్యక్తి, పెళ్లి తరువాత మాత్రం పట్టించుకుంటాడా అని అనుకున్నదో ఏమోగాని, పెళ్లిపీఠలపై తనని వదిలి మద్యం కోసం పరుగులు తీసే వ్యక్తి తనకు భర్తగా పనికిరాడని, అతన్ని పెళ్లి చేసుకోను అని తేల్చి చెప్పింది.

వధువు నిర్ణయం విని ఒక్కసారిగా వరుడుతో సహా బంధువులంతా షాక్ అయ్యారు. ఈ నేపథ్యంలో బంధువులంతా కలిసి వధువుకు నచ్చ చెప్పేందుకు ప్రయత్నించినా ఆమె ఒప్పుకోలేదు. ఇది ఇలా ఉండగా రగులుతున్న హోమంలో ఆర్జ్యం పోసినట్టు ముందే అసలే ఆగ్రహంతో ఉన్న వధువును వరుడు దుర్భాషలాడాడు. దీంతో గొడవ మరింత పెద్దదైంది.

చివరికి వధువు కుటుంబ సభ్యులు పెళ్లిని రద్దు చేసుకున్నారు. అలానే రూ.8లక్షలు తమకు నష్టపరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేస్తూ వరుడి కుటుంబ సభ్యులను బంధించారు. కాగా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వధువు కుటుంబ సభ్యులు వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Advertisement

Next Story

Most Viewed