యడ్యూరప్పకు షాక్..పోక్సో కేసులో చార్జిషీట్ దాఖలు

by vinod kumar |
యడ్యూరప్పకు షాక్..పోక్సో కేసులో చార్జిషీట్ దాఖలు
X

దిశ, నేషనల్ బ్యూరో: మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ నేత యడ్యూరప్పపై క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సీఐడీ) గురువారం చార్జిషీట్ దాఖలు చేసింది. ఆయనతో పాటు మరో ముగ్గురిపై ప్రత్యేక కోర్టులో గురువారం చార్జ్ షీట్ వేసింది. మార్చి 14న ఓ 54 ఏళ్ల మహిళ యడ్యూరప్పపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఉత్తర బెంగళూరులోని డాలర్స్ కాలనీలోని తన ఇంట్లో యడ్యూరప్ప తన 17 ఏళ్ల కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించింది. దీంతో సదాశివనగర్ పోలీసులు వేధింపుల కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ నిమిత్తం ఈ కేసును రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అలోక్ మోహన్ సీఐడీకి అప్పగించారు. అప్పటి నుంచి ఈ కేసులు సీఐడీ దర్యాప్తు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా చార్జిషీట్ దాఖలు చేశారు. కాగా, ఈ కేసులో జూన్ 17న యడ్యూరప్పను సీఐడీ సుమారు మూడు గంటల పాటు విచారించింది. ఈ కేసులో యడ్యూరప్ప అరెస్టును నిలిపివేయాలని గతంలో కర్ణాటక హైకోర్టు సీఐడీని ఆదేశించింది.

Advertisement

Next Story

Most Viewed