కేజ్రీవాల్‌కు షాక్..బెయిల్ పొడిగింపు పిటిషన్‌ తిరస్కరణ

by vinod kumar |
కేజ్రీవాల్‌కు షాక్..బెయిల్ పొడిగింపు పిటిషన్‌ తిరస్కరణ
X

దిశ, నేషనల్ బ్యూరో: మధ్యంతర బెయిల్‌ను మరో ఏడు రోజులు పొడిగించాలని కోరుతూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు బుధవారం తోసిపుచ్చింది. సాధారణ బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లే స్వేచ్ఛ కేజ్రీవాల్‌కు ఉందని, అందుకే పిటిషన్‌ను స్వీకరించడం లేదని స్పష్టం చేసింది. అరెస్ట్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై తీర్పు ఇప్పటికే రిజర్వ్‌లో ఉన్నందున, మధ్యంతర బెయిల్ పొడిగింపు కోసం కేజ్రీవాల్ చేసిన వినతికి ప్రధాన పిటిషన్‌తో సంబంధం లేదని తెలిపింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టైన కేజ్రీవాల్‌కు ఈ నెల 10వ తేదీన జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం లోక్ సభ ఎన్నికల్లో ఎన్నికల్లో ప్రచారానికి గాను మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఎన్నికల అనంతరం జూన్ 2వ తేదీన తీహార్ జైలులో లొంగి పోవాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే ఆరోగ్య కారణాల రిత్యా బెయిల్‌ను మరో 7 రోజులు పొడిగించాలని పిటిషన్ దాఖలు చేయగా..తిరస్కరించింది. దీంతో కేజ్రీవాల్ జూన్ 2న లొంగిపోవాల్సి ఉంటుంది.

Advertisement

Next Story