Shivaji statue: సింధుదుర్గ్‌లో నూతన శివాజీ విగ్రహం.. కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం

by vinod kumar |
Shivaji statue: సింధుదుర్గ్‌లో నూతన శివాజీ విగ్రహం.. కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర సింధుదుర్గ్‌లోని రాజ్‌కోట్‌లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కూలిన విషయం తెలిసిందే. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అదే స్థలంలో కొత్త విగ్రహం ఏర్పాటు చేయడానికి ఓ కమిటీని ఏర్పాటు చేసింది. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ అడిషనల్ చీఫ్ సెక్రటరీ మనీషా మైస్కర్ ఈ కమిటీకి నేతృత్వం వహించనుండగా..చరిత్రకారుడు జయసింగరావు పవార్‌ను కమిటీ సభ్యుడిగా ప్రత్యేకంగా ఆహ్వానించారు. అలాగే ఇంజినీరింగ్‌ నైపుణ్యం కలిగిన ఐఐటీ ముంబైకి చెందిన నిపుణులు, ప్రొఫెసర్లను కూడా కమిటీలో చేర్చారు. విగ్రహ నిర్మాణ పనులకు సంబంధించిన విధివిధానాలను కమిటీ రూపొందించనుంది. అయితే కమిటీకి కాలపరిమితిని నిర్దేశించలేదు. కాగా, సింధుదుర్గ్ జిల్లాలోని కోటలో గతేడాది ప్రధాని మోడీ ఆవిష్కరించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ఆగస్టు 26న కూలిపోయిన విషయం తెలిసిందే. దీనిపై ప్రధాని మోడీ, షిండేలు క్షమాపణలు చెప్పారు. ఈ క్రమంలోనే నూతన విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

Advertisement

Next Story