సిమ్లాలో ఏడాది కనిష్ట ఉష్ణోగ్రత నమోదు.. ఎంతంటే..

by Disha News Desk |
సిమ్లాలో ఏడాది కనిష్ట ఉష్ణోగ్రత నమోదు.. ఎంతంటే..
X

ధర్మశాల: సిమ్లాలో కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు భారత వాతావరణ సంస్థ వెల్లడించింది. ఉష్ణోగ్రత శనివారం -2.1 డిగ్రీలకు పడిపోయినట్లు తెలిపింది. ఈ ఏడాదిలో షిమ్లాలో ఇదే అత్యంత కనిష్టమని పేర్కొంది. ఇక హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో లాహౌల్-స్పితి జిల్లాలో -12.5 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. యాపిల్స్‌కు ప్రసిద్ధి చెందిన కల్పాలో -7, మనాలీలో -4.4 డిగ్రీలుగా నమోదైనట్లు వెల్లడించింది. గత 24 గంటల్లో కుర్ఫీ‌లో 60 సెంటిమీటర్లు మంచు కురవగా, ఛోపాల్, సిమ్లాలో వరుసగా 45.7, 32.6 సెంటీమీటర్లు కురిసినట్లు తెలిపారు. భారీగా మంచు కురవడంతో అనవసర ప్రయాణాలు చేయొద్దని స్థానికులకు ప్రభుత్వాధికారులు సూచించారు. అయితే భారీ హిమపాతాన్ని లెక్కచేయకుండా పర్యాటకులు వస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed