- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Maharashtra: హైకోర్టు తీర్పుతో శనివారం నాటి రాష్ట్ర బంద్ క్యాన్సల్
దిశ, నేషనల్ బ్యూరో: థానే జిల్లాలోని బద్లాపూర్‌లో ఒక పాఠశాలలో ఇద్దరు బాలికలపై లైంగిక వేధింపులకు నిరసనగా ఆగస్టు 24(శనివారం) నాడు మహారాష్ట్ర బంద్‌కు విపక్షాలు పిలుపునివ్వగా ముంబై హైకోర్టు శుక్రవారం జోక్యం చేసుకుని రాజకీయ పార్టీలు కానీ, వ్యక్తులు కానీ బంద్‌కు దూరంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో కోర్టు తీర్పును దృష్టిలో ఉంచుకుని శనివారం నాటి మహారాష్ట్ర బంద్‌ను ఉపసంహరించుకోవాలని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ శుక్రవారం విజ్ఞప్తి చేశారు.
హైకోర్టు బంద్ రాజ్యాంగ విరుద్ధమని తీర్పునిచ్చింది. సమయం తక్కువగా ఉండటం వల్ల హైకోర్టు ఆదేశాలపై సుప్రీం కోర్టులో అప్పీల్ చేయడం సాధ్యం కాదు, అందుకే బంద్ పిలుపును ఉపసంహరించుకుంటున్నామని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. మహారాష్ట్ర బంద్‌పై దాఖలైన పలు పిటిషన్లపై చీఫ్ జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ సారథ్యంలోని హైకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. అనంతరం ఈ ఆదేశాలను జారీ చేసింది. మరోవైపు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ముంబై హైకోర్టు ఆదేశాలను ప్రతిపక్షాలకు "చెంపదెబ్బ" అని అభివర్ణించారు, ప్రభుత్వం కోర్టు ఆదేశాన్ని అమలు చేస్తుందని అన్నారు.