ఢిల్లీలో తీవ్ర రాజ్యాంగ సంక్షోభం: సీఎం కేజ్రీవాల్ ఆరోపణలు

by samatah |
ఢిల్లీలో తీవ్ర రాజ్యాంగ సంక్షోభం: సీఎం కేజ్రీవాల్ ఆరోపణలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీలో తీవ్ర రాజ్యాంగ సంక్షోభం నెలకొందని ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. బీజేపీ ఒత్తిడి కారణంగా అధికారులు పని చేయడానికి నిరాకరిస్తున్నారని విమర్శించారు. సోమవారం ఆయన ఢిల్లీ అసెంబ్లీలో మాట్లాడారు. ఢిల్లీ అధికారాలన్ని కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉండటమే ఈ సమస్యకు కారణమని తెలిపారు. ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాన్ని పని చేయనివ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము స్పష్టంగా పని చేయడానికి వారు మాత్రం ఇష్ట పడటం లేదన్నారు. నీటి బిల్లులను సరిచేసే వన్‌టైమ్ సెటిల్‌మెంట్ పథకాన్ని కొందరు కావాలనే అడ్డుకుంటున్నారని చెప్పారు. దీనిపై బీజేపీ వెంటనే స్పందించాలన్నారు. ఈ పథకం క్లియరెన్స్ కోసం లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చండీగఢ్ మేయర్ పదవికి బీజేపీ నేత మనోజ్ సోంకర్ రాజీనామా చేయడంతో ఎన్నికల్లో అవకతవకలు జరిగాయనే విషయం స్పష్టమైందన్నారు. ఎన్నికల్లో గెలవకపోవడంతోనే బీజేపీ ఆప్ కౌన్సిలర్లను కొనుగోలు చేసిందని మండిపడ్డారు. బీజేపీ పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తుందని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed