- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహారాష్ట్ర, అరుణాచల్‌ప్రదేశ్‌లలో వరుస భూకంపాలు: భయబ్రాంతులకు గురైన ప్రజలు
దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్‌లలో గురువారం తెల్లవారుజామున వరుస భూపంపాలు సంభవించాయి. ఇరు రాష్ట్రాల్లో రెండు సార్లు ప్రకంపనలు వచ్చినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్‌లో తెల్లవారుజామున 01:49 గంటలకు 3.7 తీవ్రతతో మొదటి భూకంపం సంభవించగా.. ఆ తర్వాత 3.4 తీవ్రతతో 03:40 గంటలకు మరోసారి భూకంపం సంభవించినట్టు పేర్కొంది. అరుణాచల్ ప్రదేశ్‌లోని పశ్చిమ కమెంగ్‌లో భూకంపం కేంద్రీకృతమై ఉన్నట్టు వెల్లడించింది. రెండు గంటల వ్యవధిలోనే రెండు సార్లు ప్రకంపనలు రావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.
ఇక, మహారాష్ట్రలోనూ 10 నిమిషాల వ్యవధిలోనూ రెండు భూకంపాలు సంభవించాయి. హింగోలీ నగరంలో ఉదయం 06:08 గంటలకు 4.5 తీవ్రతతో మొదటి భూకంపం సంభవించగా..06:19 గంటలకు రెండోసారి భూపంకం సంభవించగా దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదైంది. భూపంకం కేంద్రం హింగోలీలోనే 10కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. అయితే రెండు రాష్ట్రాల్లో భూప్రకంపనల కారణంగా ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టంకు సంబంధించిన వివరాలను అధికారులు వెల్లడించలేదు.