డీప్‌సీక్ సెన్సిటివ్ డేటా లీక్

by John Kora |
డీప్‌సీక్ సెన్సిటివ్ డేటా లీక్
X

- ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమైన చాట్ లాగ్స్

- వెల్లడించిన విజ్

దిశ, నేషనల్ బ్యూరో:

చైనీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ డీప్‌సీక్‌కు సంబంధించిన సున్నితమైన డేటా లీక్ అయినట్లు న్యూయార్క్‌కు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ విజ్ పేర్కొంది. డీప్‌సీక్‌కు చెందిన డేటా అనుకోకుండా ఓపెన్ ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమైనట్లు విజ్ గుర్తించినట్లు తమ బ్లాగ్‌లో పేర్కొంది. డీప్‌సీక్ సంస్థ అనుకోకుండా మిలియన్ లైన్లకు పైగా కోడ్‌ను నిర్లక్ష్యంగా వదిలేసినట్లు పేర్కొంది. ఇందులో డిజిటల్ సాఫ్ట్‌వేర్ కీస్, ఏఐ అసిస్టెంట్‌తో యూజర్లు జరిపిన చాట్ లాగ్స్ కూడా ఉన్నట్లు తెలిపింది. అయితే డీప్‌సీక్‌కు ఈ విషయాన్ని వెంటనే తెలియజేశామని.. గంటలోపే డేటాను మొత్తం సెక్యూర్డ్ చేసినట్లు విజ్ వెల్లడించింది. అయితే ఈ డేటాను తాము కాకుండా ఇతరులు కూడా గుర్తించే ఉంటారని, దీని వల్ల జరిగే డ్యామేజ్ ఏంటనేది మున్ముందు తెలుస్తుందని విజ్ చెప్పింది. కాగా, చైనాకు చెందిన డీప్‌సీక్ విడులైన వెంటనే విజయవంతం అయ్యింది. తక్కువ ఖర్చుతో ఓపెన్ ఏఐ ద్వారా రూపొందించిన డీప్‌సీక్.. అమెరికాలోని దిగ్గజ ఏఐ కంపెనీలు ఎన్‌వీడియా, మైక్రోసాఫ్ట్‌లకు సవాలు విసిరింది. ఆపిల్ స్టోర్‌లో డీప్‌సీక్ డౌన్‌లోడ్లు చాట్ జీపీటీని దాటేశాయి.


Next Story

Most Viewed