భారత్‌లో రెండో బర్డ్ ఫ్లూ కేసు..ధ్రువీకరించిన డబ్ల్యూహెచ్ఓ

by vinod kumar |
భారత్‌లో రెండో బర్డ్ ఫ్లూ కేసు..ధ్రువీకరించిన డబ్ల్యూహెచ్ఓ
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌లో రెండో బర్డ్ ఫ్లూ కేసు వెలుగులోకి వచ్చింది. పశ్చిమ బెంగాల్‌లో నాలుగేళ్ల చిన్నారి హెచ్9ఎన్2 వైరస్ బారినపడింది. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్లూహెచ్ఓ) ధ్రువీకరించింది. శ్వాసకోస సమస్యలు, అధిక జ్వరం, పొత్తి కడుపు తిమ్మిరి వంటి సమస్యలతో బాధపడిన చిన్నారి ఫిబ్రవరిలో ఆస్పత్రిలో చేరినట్టు పేర్కొంది. పలు చికిత్సల అనంతరం ఆమెను మూడు నెలల తరువాత డిశ్చార్జ్ చేసినట్టు తెలిపింది. బాలిక ఇంటి పరిసరాల్లో ఫౌల్ట్రీ ఉండటం ద్వారా కోళ్లు ఎక్కువగా ఉండేవని డబ్లూహెచ్ఓ తెలిపింది. బాలిక కుటుంబం, వారికి సన్నిహితంగా ఉండే వ్యక్తుల్లో వ్యాధి లక్షణాలు లేవని వెల్లడించింది. అయితే చికిత్స టైంలొ బాలిక టీకా స్థితి, యాంటీ వైరల్ ట్రీట్‌మెంట్ వివరాలు ప్రస్తుతానికి అందుబాటులో లేవని పేర్కొంది. హెచ్9ఎన్2 వైరస్ సాధారణంగా తేలికపాటి అనారోగ్యానికి కారణమవుతుంది, అయితే వివిధ ప్రాంతాల్లో పౌల్ట్రీలో వైరస్ ప్రబలంగా ఉన్నందున మరిన్ని కేసులు మానవులకు సంభవించే అవకాశం ఉందని డబ్లూహెచ్ లో అంచనా వేస్తోంది. కాగా, భారత్ లో తొలి బర్డ్ ఫ్లూ కేసు 2019లో వెలుగు చూసింది.

Advertisement

Next Story

Most Viewed