Exit Polls Day : ఎగ్జిట్ పోల్స్ రోజున అవకతవకలు జరగలేదు : సెబీ వర్గాలు

by Hajipasha |
Exit Polls Day : ఎగ్జిట్ పోల్స్ రోజున అవకతవకలు జరగలేదు : సెబీ వర్గాలు
X

దిశ, నేషనల్ బ్యూరో : లోక్‌‌సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలైన జూన్ 3వ తేదీన స్టాక్ మార్కెట్ల భారీ పెరుగుదలపై గతంలో పలువురు విపక్ష ఎంపీలు సందేహాలు వ్యక్తం చేశారు. అనూహ్యంగా బీజేపీ, ఎన్డీయే కూటమి ఎంపీల సంఖ్య తగ్గిపోవడంతో ఆ మరుసటి రోజే (జూన్ 4న) స్టాక్ మార్కెట్లు కుప్పకూలిన వ్యవహారంపైనా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. స్టాక్ మార్కెట్లు భారీగా పతనం కావడంతో జూన్ 4న సామాన్య ఇన్వెస్టర్ల రూ.31 ట్రిలియన్ల సంపద ఆవిరైందని ఆరోపించారు.

ఈనేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలైన జూన్ 3న స్టాక్ మార్కెట్ కదలికల సమాచారంపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) అధికార వర్గాలు సమగ్ర విశ్లేషణ చేసినట్లు తెలిసింది. ఎగ్జిట్ పోల్స్ రోజున స్టాక్ మార్కెట్ మానిప్యులేషన్ జరిగినట్లు కానీ, ఇన్‌సైడర్ ట్రేడింగ్‌‌కు పాల్పడినట్లు కానీ ఆధారాలు లభించలేదని సెబీ అధికార వర్గాలు తెలిపాయంటూ జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.


Advertisement

Next Story

Most Viewed