బ‌స్సులో బ‌హిరంగంగా అమ్మాయిలూ, అబ్బాయిలూ క‌లిసి.. వీడియో పోలీసులుదాకా వెళ్లింది!

by Sumithra |   ( Updated:2023-09-01 15:33:11.0  )
బ‌స్సులో బ‌హిరంగంగా అమ్మాయిలూ, అబ్బాయిలూ క‌లిసి.. వీడియో పోలీసులుదాకా వెళ్లింది!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః తమిళనాడులోని చెంగల్‌పట్టు జిల్లాలో ఈ సంఘ‌ట‌న చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సులో పాఠశాల విద్యార్థులు మద్యం సేవిస్తున్న వీడియో వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన ఈ వీడియో క్లిప్‌ను బ‌స్సులో ఉన్న ఓ విద్యార్థి రికార్డ్ చేసినట్లు భావిస్తున్నారు. ఇందులో అమ్మాయిలు, అబ్బాయిలు క‌లిసి బీర్ బాటిల్ తెరిచి, బీర్ తాగుతున్న దృశ్యాలు క‌నిపిస్తున్నాయి. అయితే, ఈ విద్యార్థులంతా చెంగల్‌పట్టులోని ప్రభుత్వ పాఠశాలకు చెందిన వారుగా భావిస్తున్నారు. తొలుత పాత వీడియోగా భావించన‌ప్ప‌టికీ, ద‌ర్యాప్తులో ఈ సంఘ‌ట‌న‌ మంగళవారం జరిగినట్లుగా గుర్తించారు. విద్యార్థులు తమ పాఠశాల యూనిఫారంలో తిరుకఝుకుండ్రం నుండి తాచూర్‌కు వెళుతున్న బస్సులో ఉన్న‌ట్లు పోలీసు అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటన ఉన్న‌తాధికారుల దృష్టికి తీసుకెళ్లి, విచారణ జరుపుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు. విచారణ పూర్తయ్యాక తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

సెక్స్ కోరికలు, సామాజిక విలువలు.. భయంతో చచ్చిపోయానన్న నటి

Advertisement

Next Story