- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సెక్స్ కోరికలు, సామాజిక విలువలు.. భయంతో చచ్చిపోయానన్న నటి
దిశ, సినిమా: అక్షర హాసన్ తాజాగా నటించిన చిత్రం 'అచ్చం మడం నాణం పయిర్పు'. ఈ సినిమా ఓటీటీ వేదికగా మార్చి 25న విడుదల కాబోతుండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అక్షర.. సినిమా స్టోరీతో పాటు తన బలం, బలహీనతల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఈ మేరకు సినిమాలో చాలా భయస్తురాలైన యుక్తవయసు అమ్మాయిగా నటించినట్లు చెప్పిన ఆమె.. సంప్రదాయవాద కుటుంబానికి చెందిన ఓ యువతి లైంగిక కోరికలు, సామాజిక విలువలను కాపాడే క్రమంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొందో వివరించింది. అలాగే తన నిజ జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయన్న నటి.. యవ్వనారంభ దశలో ప్రతి ఒక్కరి జీవితాల్లో పొరపాట్లు జరుగుతాయని, అయితే కొంతకాలానికి బలం, బలహీనతలను గుర్తించి నిజమైన క్యారెక్టరేంటో నిరూపించుకోవాలని సూచించింది. ఇక చివరగా ఎంతోమంది కుటుంబ విలువలు, వ్యక్తిగత కోరికలను బ్యాలెన్స్ చేయలేక జీవితాలను అర్థాంతరంగా ముగించడం బాధగా ఉంటుందన్న అక్షర.. ఇతర పర్సనల్ లైఫ్‌కు సంబంధించి తీర్పు చెప్పే హక్కు ఎవరికీ లేదని, తాను ఈ విషయం పై బలంగా మాట్లాడినందుకే తనను ఎక్కువమంది ఇష్టపడరని తెలిపింది.