- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జై శ్రీరామ్ అనండి..ఆకలితో చనిపోండి: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ
దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని మోడీపై విరుచుకుపడ్డారు. ప్రజలు రోజంతా జై శ్రీరాం నినాదాలు చేయాలని, ఆకలితో అలాగే చనిపోవాలని ప్రధాని మోడీ కోరుకుంటున్నారని విమర్శించారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా మధ్యప్రదేశ్‌లో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ‘నిరుద్యోగ యువకులు రోజంతా తమ సెల్ ఫోన్లలో రీల్స్ చూస్తూ..జై శ్రీరామ్ నినాదాలు చేస్తున్నారు. ప్రధాని మోడీ కోరుకుంటున్నది కూడా ఇదే. ప్రజలు ఆకలితో అలమటిస్తున్నా ఆయన జైశ్రీరామ్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. ‘ఇంతకుముందు సాయుధ దళాలు యువతకు రెండు హామీలు ఇచ్చాయి. మొదట, పెన్షన్ ఇస్తారు. వారు చనిపోతే గౌరవ వందనం కూడా స్వీకరిస్తారు. కానీ మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నపథ్ స్కీమ్ వల్ల ఇవన్నీ సైనికులు కోల్పోతున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో నిరుద్యోగం, పేదరికం నిరంతరం పెరిగిపోతున్నా కేంద్ర ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కాగా, రాహుల్ యాత్రలో భాగంగా బీజేపీ శ్రేణులు మోడీ, జైశ్రీరాం నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే రాహుల్ పై వ్యాఖ్యలు చేశారు.