భారత్‌కు సౌదీ అతి ముఖ్యమైన భాగస్వామి : ప్రధాని మోడీ

by Vinod kumar |
భారత్‌కు సౌదీ అతి ముఖ్యమైన భాగస్వామి : ప్రధాని మోడీ
X

న్యూఢిల్లీ : భారత్‌కు అత్యంత వ్యూహాత్మక భాగస్వాముల్లో సౌదీ అరేబియా ఒకటని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇరుదేశాలు కొత్తకొత్త రంగాల్లో భాగస్వామ్యాలతో సంబంధాలను బలోపేతం చేసుకుంటున్నాయని చెప్పారు. ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌లో సౌదీ యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌తో భేటీ సందర్భంగా భారత ప్రధాని మోడీ మాట్లాడారు. ప్రాంతీయంగానే కాకుండా అంతర్జాతీయ స్థిరత్వంలోనూ భారత్‌-సౌదీ అరేబియాల మధ్య భాగస్వామ్యం ఎంతో కీలకమని పేర్కొన్నారు.

వాణిజ్య సంబంధాలు, రక్షణ - భద్రత, ఆహార భద్రత, ఆరోగ్య సంరక్షణ, గ్రిడ్ కనెక్టివిటీ, పునరుత్పాదక ఇంధనం, ఇంధన భద్రత, సెమీకండక్టర్లు, పెట్టుబడులతో సహా పలు రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడంపై ఇరువురు నేతలు చర్చించారు. జీ20 సదస్సును విజయవంతంగా నిర్వహించినందుకు భారత్‌ను అభినందిస్తున్నానని మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ అన్నారు. భారత్, సౌదీలకు గొప్ప భవిష్యత్తును సృష్టించేందుకు కలిసికట్టుగా పనిచేస్తామని ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed