- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Congress: ‘‘గూండాలు, లోఫర్లే రాజకీయాలు చేయాలా?’’ ఖర్గేకు రామభద్రాచార్య స్ట్రాంగ్ కౌంటర్
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు శ్రీరామభద్రాచార్య స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇటీవల యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై ఖర్గే ఇన్‌డైరెక్ట్‌గా చేసిన కామెంట్స్‌పై ఈ రోజు (మంగళవారం) స్పందించిన స్వామీజీ.. ‘కాషాయ వస్త్రాలు ధరించి రాజకీయాలు చేయొద్దని ఎక్కడైనా రాసుందా..? కాషాయ వస్త్రాలు ధరించిన వాళ్లు కాకపోతే గూండాలు, లోఫర్లు మాత్రం చేయొచ్చా..?’ అని అంటూ జగద్గురు శ్రీరామభద్రాచార్య ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘కాషాయం ధరించినవాళ్లే రాజకీయాలు చేయాలి. కాషాయమంటే దేవుడి రంగు, కాషాయ జెండా ఎగురవేసే ఛత్రపతి శివాజీ మహారాష్ట్రను ఏకంగ చేశాడు. సూటు, బూటు వేసుకున్నోళ్లు రాజకీయం చేయకూడదు. అని శ్రీరామభద్రాచార్య పేర్కొన్న మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
కాగా.. ఇటీవల కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కాషాయ వస్త్రాలపై, ఆయన గుండుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలో ఆదివారం నాడు నిర్వహించిన ఓ ఎలక్షన్ ర్యాలీలో పాల్గొన్న ఆయన.. యోగి ఆదిత్యనాథ్ ఇచ్చిన ‘బటేంగే తో కటేంగే’ స్లోగన్ గురించి మాట్లాడుతూ.. ‘‘సాధువుల రూపంలో కాషాయ వస్త్రాలు ధరించి రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో కొంతమంది ముఖ్యమంత్రులు కూడా అయ్యారు. సీఎంలు అయిన వాళ్ల తలపై వెంట్రుకలు కూడా ఉండవు. బీజేపీకి నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. తెల్లబట్టలు కట్టుకుని రాజకీయాలైనా చేయండి. లేదంటే కాషాయం కట్టుకుని పాలిటిక్స్‌ను వదిలి వెళ్లిపోండి’’ అంటూ వివాదాస్పద కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ రామభద్రాచార్య తాజా వ్యాఖ్యలు చేశారు.