Supreme Court: 51వ సీజేఐగా సంజీవ్ ఖన్నా ప్రమాణస్వీకారం

by karthikeya |   ( Updated:2024-11-11 04:59:26.0  )
Supreme Court: 51వ సీజేఐగా సంజీవ్ ఖన్నా ప్రమాణస్వీకారం
X

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశ 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో నేడు (సోమవారం) ఈ కార్యక్రమం జరిగింది. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా వచ్చే ఏడాది మే 13 వరకు సీజేఐగా బాధ్యతలు నిర్వహిస్తారు. కాగా.. సీజేఐగా జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ పదవీకాలం ఆదివారంతో ముగియడంతో ఆయన స్థానంలో ఇప్పుడు సంజీవ్ ఖన్నా ఆ బాధ్యతలను నిర్వహిస్తారు. జస్టివ్ సంజీవ్ ఖన్నా పేరును సీజేఐగా మాజీ సీజేఐ చంద్రచూడ్ స్వయంగా సిఫారసు చేసిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే 1960, మే 14న జన్మించిన ఆయన 2019 జనవరి నుంచి సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. న్యాయమూర్తిగా ఎన్నికల బాండ్లు, అధికరణం 370, ఈవీఎంల నిబద్ధత, మద్యం కుంభకోణం వంటి అనేక కేసుల్లో కీలక తీర్పులిచ్చిన సంజీవ్ ఖన్నా.. మొత్తం 6 ఏళ్లలో 117 తీర్పులు ఇచ్చారు. 456 తీర్పుల్లో సభ్యుడిగా భాగస్వామిగా ఉన్నారు. ఇక ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌, ప్రధాని మోడీ, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌, మాజీ సీజేఐ డీవై చంద్రచూడ్ సహా తదితరులు హాజరయ్యారు.

Advertisement

Next Story

Most Viewed