Sandip Ghosh: కోల్‌కతా లైంగిక దాడి ఘటన.. సందీప్ ఘోష్‌కు ఈ నెల 17వరకు సీబీఐ కస్టడీ

by vinod kumar |
Sandip Ghosh: కోల్‌కతా లైంగిక దాడి ఘటన.. సందీప్ ఘోష్‌కు ఈ నెల 17వరకు సీబీఐ కస్టడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌ లైంగిక దాడి, హత్య కేసులో ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్, పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ అభిజిత్ మండల్‌ను సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం వారిని కోర్టులో హాజరుపర్చగా సీబీఐ అభ్యర్థన మేరకు న్యాయస్థానం వారికి ఈ నెల 17 వరకు కస్టడీ విధించింది. ఈ కేసులో ఇద్దరినీ కలిపి విచారించనున్నట్టు అధికారులు తెలిపారు. కాగా, ఎఫ్ఐఆర్ నమోదులో జాప్యం చేయడంతో పాటు, సాక్షాలు తారుమారు చేశారని వీరిద్దరిపై ఆరోపణలున్నాయి. ఘటన జరిగిన మరుసటి రోజు, సెమినార్ హాల్ ప్రక్కనే ఉన్న గదులను పునరుద్ధరించాలని సందీప్ ఆదేశించినట్టు సీబీఐ విచారణలో వెల్లడైంది. అలాగే ఆగస్టు 9న ఉదయం 10 గంటల ప్రాంతంలో డాక్టర్‌ మృతి చెందినట్లు మోండల్‌కు సమాచారం అందగా, రాత్రి 11 గంటలకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు సీబీఐ పేర్కొంది. ఘటన అనంతరం ఇద్దరు ఒకరి కొకకు టచ్‌లో ఉన్నారని ఆరోపించింది.

Advertisement

Next Story

Most Viewed