- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సుప్రీం కోర్టు ముందే ఎంగేజ్‌మెంట్ చేసుకున్న స్వలింగ జంట
దిశ, డైనమిక్ బ్యూరో: స్వలింగ వివాహంపై సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఆధ్వర్యంలో స్వలింగ సంపర్కుల వివాహానికి ఎలాంటి చట్టపరమైన అనుమతి ఇవ్వడానికి నిరాకరించింది. స్వలింగ వివాహానికి చట్టబద్ధ కల్పించే అధికారం పార్లమెంట్‌కే ఉందని స్పష్టం చేసింది. దీనిపై పార్లమెంట్ నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. అయితే ఈ తీర్పు నేపథ్యంలో ఓ స్వలింగ జంట సుప్రీం కోర్టు ఎదుట ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఉంగరాలు మార్చుకుంటున్న ఫొటోను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. తాజాగా ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు వారిని అభినందిస్తున్నారు. స్వలింగ వివాహాలకు సుప్రీం కోర్టు తీర్పు తమకు నిరాశ గురి చేసిందని ఎంగేజ్మెంట్ చేసుకున్న అనన్య కోటియా పేర్కొన్నారు. సుప్రీం కోర్టు తీర్పు బాధించిందని, మా హక్కులను నిరాకరించిన కోర్టుకు వద్దకు వెళ్లి ఉంగరాలు మార్చుకున్నామని తెలిపారు. తాము మరొక రోజు పోరాడటానికి తిరిగి వస్తామని స్పష్టం చేశారు.