ఆజం ఖాన్ కుమారుడిపై అనర్హత వేటు

by Javid Pasha |
ఆజం ఖాన్ కుమారుడిపై అనర్హత వేటు
X

లక్నో: పదిహేను ఏళ్ల నాటి కేసులో దోషిగా తేలడంతో సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత ఆజం ఖాన్ కుమారుడు, అదే పార్టీకి చెందిన అబ్దుల్లా ఆజం ఖాన్‌పై ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ అనర్హత వేటు వేసింది. సువార్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అబ్దుల్లా ఖాన్ అనర్హతకు గురికావడం ఇది రెండోసారి. దీంతో అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని పార్టీకి ఎదురుదెబ్బ తగిలినట్టయింది. 2008లో జరిగిన ఘటనపై విచారించిన మొరాదాబాద్ కోర్టు అబ్దుల్లా ఆజం ఖాన్‌తో పాటు అతని తండ్రికి కూడా రెండేళ్ల జైలు శిక్ష విధించింది.

కానీ ఇద్దరికీ బెయిల్ మంజూరు చేసింది. 2008 జనవరి 29న హైవే పైన నిరసన తెలుతున్న సమయంలో ఓ ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించారు. అంతేకాకుండా ఆ ఉద్యోగిపై అనేక తప్పుడు ఆరోపణలు చేశారు. ఈ కేసులో వీరిద్దరు దోషులుగా తేలారు. చట్టం ప్రకారం రెండు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు జైలు శిక్ష పడిన చట్టసభ్యుడిని నేరారోపణ జరిగిన తేదీ నుంచి అనర్హుడిగా ప్రకటిస్తారు. అంతేకాకుండా జైలు శిక్ష అనంతరం మరో ఆరు సంవత్సరాలు అనర్హులుగా ఉండాల్సి ఉంటుంది.

Also Read..

ఆర్బీఐ, సెబీకి జైరాం రమేష్ లేఖ

Advertisement

Next Story

Most Viewed