- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Sabarimala: శబరిమల వెళ్లే భక్తులకు భారీ గుడ్ న్యూస్.. ఇక నుంచి ఫ్రీ ఇన్సూరెన్స్ కవరేజీ
దిశ, వెబ్‌డెస్క్: శబరిమల (Sabaraimala) వెళ్లే యాత్రికులకు ట్రావన్‌కోర్ దేవస్థానం (Travancore Temple) భారీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు రూ.5 లక్షల ఫ్రీ ఇన్సూరెన్స్ కవరేజీని (Free Insurance Coverage) కల్పిస్తుంది. ఆలయానికి లక్షల్లో యాత్రికులు తరలిరానుండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేరళ ప్రభుత్వం (Kerala Government) అన్ని ఏర్పాటు చేస్తోంది. అయితే, యాత్రకు వచ్చిన భక్తులు ఎవరైనా దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోతే వారిని తమ స్వగ్రామాలకు తరలించే బాధ్యతను కూడా ట్రావన్‌కోర్ దేవస్థానమే తీసుకోనుంది.
అదేవిధంగా ఇన్సూరెన్స్ డబ్బులు రూ.5 లక్షలను అందజేయనుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం అయ్యప్ప మాలధారణ భక్తుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇరుముడితో విమానాల్లో ప్రయాణించవచ్చని స్పష్టం చేసింది. కాగా, 2025 జనవరి 20వ వరకు మాత్రమే ఆదేశాలు అమల్లో ఉంటాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) తెలిపారు. కేరళ ప్రభుత్వం (Kerala Government) అయ్యప్ప దర్శన వేళల్లో స్వల్ప మార్పులు చేసింది. ఇక నుంచి తెల్లవారుజామున 3 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మళ్లీ మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మాత్రమే స్వామి వారి దర్శనానికి అనుమతిస్తారు.