- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
యూఎన్ లో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ పదవీవిరమణ
దిశ, నేషనల్ బ్యూరో: ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ శనివారం పదవీవిరమణ పొందారు. దాదాపు 35 ఏళ్ల పాటు దౌత్యవేత్తగా ఆమె సేవలందించారు. యూఎన్ లో భారత శాశ్వత ప్రతినిధిగా పనిచేసిన తొలి మహిళగా ఆమె నిలిచారు.1987 బ్యాచ్ అధికారి అయిన రుచిరా.. పలు దేశాల్లో భారత దౌత్యవేత్తగా పనిచేశారు. రిటైర్ మెంట్ తర్వాత రుచిరా స్పందిస్తూ.. అసాధారణమైన సంవత్సరాలు, మరుపురాని జ్ఞాపకాలు ఇచ్చినందుకు.. థాంక్యూ భారత్ అని సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
1987 సివిల్ సర్వీసెస్ మహిళా టాపర్
రుచితా కాంబోజ్ 1987 సివిల్ సర్వీసెస్ బ్యాచ్‌లో ఆల్ ఇండియా మహిళా టాపర్. హిందీ, ఇంగ్లీష్, ఫ్రెంచ్ మాట్లాడే కాంబోజ్ 1989-91 వరకు ఫ్రాన్స్ లోని భారత రాయబార కార్యాలయంలో మూడో కార్యదర్శిగా పనిచేశారు. మారిషస్, దక్షిణాఫ్రికా, భూటాన్ సహా మరికొన్ని దేశాల్లో కూడా తన సేవలను అందించారు. 2002-2005 వరకు న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితికి భారత శాశ్వత మిషన్‌లో కౌన్సెలర్‌గా ఆమె నియామకం పొందారు. అక్కడ యూఎస్ శాంతి పరిరక్షణ, యూఎన్ భద్రతా మండలి సంస్కరణ, మధ్యప్రాచ్య సంక్షోభం తదితర అంశాలపై పనిచేశారు. 2011-2014 వరకు భారతదేశపు ప్రోటోకాల్ చీఫ్‌గా ఉన్నారు. ఇప్పటివరకు ప్రభుత్వంలో ఈ పదవిని నిర్వహించిన ఏకైక మహిళ రుచిరానే. 2022 నుంచి ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత రాయబారిగా పనిచేశారు.