ఓటీటీ, సోషల్ మీడియాపై కీలక వ్యాఖ్యలు చేసిన ఆర్ఎస్ఎస్ చీఫ్

by Mahesh |
ఓటీటీ, సోషల్ మీడియాపై కీలక వ్యాఖ్యలు చేసిన ఆర్ఎస్ఎస్ చీఫ్
X

దిశ, వెబ్ డెస్క్: ఆర్ఎస్ఎస్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ ఓటీటీ(OTT), సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లపై కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్న(శనివారం) నాగ్‌పూర్‌లో జరిగిన ఆర్‌ఎస్‌ఎస్ వార్షిక విజయదశమి ర్యాలీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఓటీటీలో చూపుతున్న కంటెంట్ పై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఈ మధ్యకాలంలో OTTలో చూపుతున్న కంటెంట్ నైతిక అవినీతికి కారణమవుతోందని, అలాంటి వాటిని ఎలాగైనా నియంత్రించాల్సిన అవసరం ఉందని మోహన్ భాగవత్ అభిప్రాయ పడ్డారు. అలాగే నేరుగా ఓటీటీలో చూపే విషయాలు చాలా అసభ్యంగా ఉంటాయని.. వాటి గురించి బహిరంగ వేదికల్లో మాట్లాడటం కూడా అసభ్యకరంగా ఉంటుందని అన్నారు. కాగా ఈ ఓటిటి లో దేశంలో నైతిక అవినీతికి ఇది కారణంగా నిలుస్తుందని, ఇలాంటి వాటిపై చట్ట ప్రకారం నియంత్రించాలని సూచించారు. అలాగే సోషల్ మీడియాలో అశ్లీలత, అసభ్యత వ్యాప్తి చెందుతుందని, దీని ద్వారా కూడా అసభ్యత విపరీతంగా వ్యాప్తి చెందుతుందని.. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఆయన చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed