- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జిల్లాలో తీవ్ర విషాదం.. నీటి గుంటలో పడి అన్నదమ్ములు మృతి
దిశ, అడ్డాకుల(మూసాపేట): మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం స్ఫూర్తి తండాలో దసరా పండగ రోజున విషాదకర సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. స్పూర్తి తండా కు చెందిన సుక్రియ నాయక్ , జ్యోతి దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కాగా దసరా పండుగ రోజు కుమారులు సాయి నాయక్ (12), సాకేత్ నాయక్ (9) శనివారం సాయంత్రం వ్యవసాయ పొలం వద్ద ఉన్న మేకను తీసుకురావడానికి కలిసి వెళ్లారు. పిల్లలు ఇద్దరు చీకటి పడిన ఇంటికి రాకపోవడంతో తండ్రి వారిని వెతుక్కుంటూ పొలం వద్దకు వెళ్లాడు. అనుమానంతో వారి పొలానికి సమీపంలో ఉన్న నీటి గుంట వద్ద పరిశీలించగా అక్కడ వారి చెప్పులు ఉండడాన్ని గుర్తించాడు. నీటిలో దిగి చూడగా అప్పటికే సాయి నాయక్ మృతి చెంది ఉండడాన్ని గుర్తించాడు. సాకేత్ నాయక్ కొన ఊపిరితో ఉన్న విషయం గుర్తించి జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. సాయి నాయక్ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో హాస్టల్‌లో ఉంటూ 8వ తరగతి చదువుతుండగా, సాకేత్ నాయక్ చక్రపూర్‌లో నాలుగో తరగతి కాగా ఈ విషయంపై ఆదివారం పోలీసులకు సమాచారం అందడంతో మూసాపేట ఎస్సై శ్రీనివాసులు ఆధ్వర్యంలో కేసు నమోదు చేసుకుని సంఘటనకు గల కారణాలపై విచారణ జరుపుతూ.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను జిల్లా ఆసుపత్రికి తరలించారు.